వ్యాయామం చేస్తున్నారా? కిడ్నీ వ్యాధులు రానేరావట..!

Exercise health benefits
Exercise health benefits
సెల్వి| Last Updated: ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:30 IST)
వ్యాయామంతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మెదడుకు మంచిది. ఈ వ్యామాయం ద్వారా మూడ్ మారుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొత్త న్యూరాన్లు పుడతాయి, దానివల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరిచేరవు. తాజాగా వ్యాయామం చేయడం ద్వారా కిడ్నీ సమస్యలు వుండవని ఓ పరిశోధనలో తేల్చింది.

వంశపారంపర్యంగా కిడ్నీ వ్యాధుల ముప్పు ఉన్నవారు వారానికి 150 నిమిషాలపాటు ఏరోబిక్ వ్యాయామాలు కానీ, లేదంటే 75 నిమిషాలపాటు ఇతర వర్కవుట్లు చేయడం ద్వారా కానీ కిడ్నీ సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.

తైవాన్‌కు చెందిన 18 ఏళ్లలోపున్న 2 లక్షల మంది ఆరోగ్యంపై జరిపిన అధ్యయనంలో.. వ్యాయామం చేయని వారితో పోలిస్తే చేసేవారిలో కిడ్నీ సమస్యల ముప్పు 9 శాతం తక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు గుర్తించారు.దీనిపై మరింత చదవండి :