నల్ల మిరియాలు ఆరోగ్య ప్రయోజనాలు
నల్ల మిరియాలు. ఈ మిరియాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటి వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
గ్లాసు నీటిలో చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్ వేసుకుని ఉదయాన్నే అల్పాహారానికి ముందు తాగితే బరువు తగ్గవచ్చు.
నల్ల మిరియాలు ఆహారంలో తీసుకుంటుంటే క్యాలరీలు ఖర్చై కొత్త ఫ్యాట్ సెల్స్ రాకుండా చూస్తాయి.
నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, సి, కె, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఖనిజాలు ఉన్నాయి.
ఉదయాన్నే రెండు నల్ల మిరియాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే మెటబాలిజం క్రమబద్ధమవుతుంది.
సన్నబడాలనుకునేవారు నల్ల మిరియాలను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
వెజిటబుల్ సలాడ్స్‌పైన నల్ల మిరియాల పొడిని చల్లి తింటే శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
మిరియాల పొడిని టీలో వేసుకుని తాగుతుంటే గొంతులో గరగర తగ్గుతుంది.