బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (21:34 IST)

బొప్పాయి పండును రాత్రిపూట తినవచ్చా? తింటే ఏమవుతుంది?

బొప్పాయి పండును రాత్రిపూట తినవచ్చు. ఇది పెద్దప్రేగును శుభ్రపరుస్తుంది. అయితే, భోజనం తర్వాత కనీసం 4-5 గంటల పాటు పండ్లు తీసుకోవడం మానుకోవాలి. కాబట్టి రాత్రిపూట బొప్పాయి కావాలనుకుంటే, భోజనాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. బొప్పాయిలో మలబద్ధకాన్ని సరిచేసే గుణం వుంది.
 
ఇకపోతే బొప్పాయితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా బొప్పాయి విత్తనాలతో కండరాలు దృఢంగా మారుతాయి. పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. ఫలితంగా రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు.
 
బొప్పాయి విత్తనాలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు, వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ, లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. అలాగే ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు స్పూన్ల బొప్పాయి విత్త‌నాల‌ను రోజూ తింటుంటే మ‌ధుమేహం, హార్ట్ ఎటాక్‌, క్యాన్స‌ర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ స‌మ‌స్య‌లు పోవడమే కాకుండా జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది.
 
శరీర బరువును త‌గ్గించ‌డంలో బొప్పాయి విత్త‌నాల‌ను ఎంతో ప‌నిచేస్తాయి. బొప్పాయి విత్తనాల వల్ల జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.