గర్భిణీ మహిళలు తప్పకుండా మొక్కజొన్నల్ని తినాలట.. ఎందుకంటే?
మెుక్కజొన్నలో పోషకాలు చాలా ఉన్నాయి. దీనిని అందరూ స్నాక్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. మొక్కజొన్న పిండిని కూడా అనేక రకాల వంటకాల్లో వాడుతుంటాం. ఎలా తిన్నా మొక్కజొన్న రుచిని మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ని తగ్గిస్తాయి. దీని కారణంగా క్యాన్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు. మెుక్కజొన్నలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉండటం వలన చర్మ సంరక్షణకు సహాయపడుతుంది. చర్మ సంబంధ వ్యాధులు తగ్గుతాయి. జింక్, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, ఇతర మినరల్స్ మొక్కజొన్నలో ఉంటాయి. ఇవి ఎముకల బలానికి చాలా ఉపయోగపడతాయి. కీళ‌్ల నొప్పులతో బాధపడేవారు మొక్కజొన్నలను ఆహారంలో భాగం చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
మొక్కజొన్నల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. మొక్కజొన్నలో పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా దోహదపడుతుంది. పేగు క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. దీంట్లో ఉండే లవణాలు, విటమిన్స్ ఇన్సులిన్‌పై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండడం వలన మొక్కజొన్న గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. వారి కడుపులోని బిడ్డకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. కాబట్టి ఇది తింటే పుట్టబోయే శిశువులు ఆరోగ్యంగా జన్మిస్తారు.