సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మే 2020 (20:28 IST)

కరివేపాకును నీడలోనే ఎండబెట్టాలట.. ఒత్తిడికి చెక్ పెట్టాలంటే?

కరివేపాకు రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కరివేపాకు పొడిలో ఉండే పీచు మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు ఉన్నవాళ్లకు, దృష్టిలోపం పెరగకుండా ఉండటానికి ఇది చాలా మంచిది. ఇంకా కరివేపాకు కాలేయ సమస్యలను తగ్గిస్తుంది. 
 
బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఆకులను మెత్తగా నూరి గడ్డలు, పొక్కులకు పైపూతగా వాడొచ్చు. దీంట్లోని తైలం.. జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. దీంట్లోని అమైనో ఆమ్లాలు గుండె కండరాలకు మేలు చేస్తాయి. అలాంటి కరివేపాకు ఆకులను నీడలో ఎండపెట్టాలి. కానీ నేరుగా ఎండలో పెట్టకూడదు. 
 
కరివేపాకు పొడిలో రెండు నిమ్మకాయలు పిండి, కాస్త ఉప్పు, కారం వేసి చివరగా తాలింపు వేసుకుంటే అన్నం, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది. ఇంకా మానసిక ఒత్తిడి, నరాల బలహీనతను కరివేపాకు తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కరివేపాకు పొడిని రోజూ తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.