మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 22 మే 2019 (15:03 IST)

కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడిని వేసుకుని తాగితే?

ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. దీనిని నియంత్రించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. డాక్టర్ల చుట్టూ తిరిగుతారు, మందులు వాడుతారు. ఇన్సులిన్ వైఫల్యం వలన ఈ వ్యాధి వస్తుంది. పాంక్రియాటిక్ గ్రంథిలో తయారయ్యే ఈ హార్మోన్ రక్తంలోని షుగర్‌ను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ వైఫల్యం వల్ల షుగర్ పెరిగి డయాబెటిస్ వస్తుంది. దీనికి ఆవాలు మంచి మందుగా పని చేస్తాయి. 
 
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఆవాలు ఏ రకంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కప్పు ఆవాలు పొడి చేసి దానిలో కొద్దిగా చక్కెర గానీ లేదా తేనె గానీ కలుపుకుని తింటే వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ పొడిలో కొద్దిగా నెయ్యి కలిపి ఇడ్లీ, దోస వంటి వాటిల్లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
 
బాగా ఎండబెట్టిన ఆవాలను నూనెలో వేయించి అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేయించుకుని తింటే మధుమేహ వ్యాధిని నియంత్రించవచ్చు. ఆవాలలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి. శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. 
 
రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కప్పు పెరుగులో కొద్దిగా ఆవాల పొడి, ఉప్పు, కొత్తిమిర వేసి తింటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తరచుగా ఆవాలతో చేసిన ఆహార పదార్థాలు తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తొలగిపోతాయి.