1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 25 నవంబరు 2022 (22:12 IST)

టైప్‌ 2 మధుమేహం, హైపర్‌టెన్షన్‌ కోసం నిశ్చయాత్మక ఫలితాలను చూపుతున్న ఫాబ్లీ అధ్యయనం

blood pressure
భారతదేశంలో అతిపెద్ద దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ (క్రానిక్‌ డిసీజ్‌ మేనేజ్‌మెంట్‌) యాప్‌ ఫాబ్లీ (PHABLE), ఇటీవలి కాలంలో హైపర్‌టెన్షన్‌, టైప్‌ 2 మధుమేహం కోసం తాము నిర్వహించిన క్లీనికల్‌ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. ఈ అధ్యయన ఫలితాలను బీపీకాన్‌ కాన్ఫరెన్స్‌ 2022 వద్ద సమర్పించారు. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ హైపర్‌టెన్షన్‌, లక్నో యొక్క వార్షిక సమావేశం బీపీకాన్‌ కాన్ఫరెన్స్‌ 2022. ఇవే అధ్యయన ఫలితాలను రీసెర్చ్‌ సొసైటీ ఆఫ్‌ ద స్టడీ ఆఫ్‌ డయాబెటీస్‌ ఇన్‌ ఇండియా, చెన్నై వార్షిక సమావేశం ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ కాన్ఫరెన్స్‌ 2022 వద్ద కూడా సమర్పించారు.
 
ఈ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, డిజిటల్‌ థెరపాటిక్స్‌ (డీటీఎక్స్‌) ఇంటర్వెన్షన్‌ను ఫాబ్లీ యొక్క ప్రొప్రైయిటరీ అల్గారిథమ్‌, స్మార్ట్‌ఫోర్‌ ఉపకరణాల ద్వారా అప్లయ్‌ చేసినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు తమ ఆరోగ్యంపై తిరిగి నియంత్రణ సాధించడం సాధ్యమైంది. టైప్‌ 2 మధుమేహం, హైపర్‌టెన్షన్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను జీవనశైలి వ్యాధులుగా పేర్కొంటారు. ఎందుకంటే ఒకరి జీవనశైలితో అనుసంధానమై ప్రమాద కారకాలు ఉంటాయి. ఈ స్థితి నియంత్రించడం కోసం తరచుగా స్వీయ పర్యవేక్షణ మరియు ప్రవర్తన మార్పు కావాల్సి ఉంటుంది. ఇవి చూడటానికి అతి సరళంగానే కనిపిస్తాయి కానీ వాటికి కట్టుబడి ఉండటం కష్టం. ఆచరణీయ వాస్తవికతగా మారడానికి ఆరోగ్యసంబంధిత ప్రవర్తన మార్పుకు స్థిరమైన మరియు నిలకడతో కూడిన  చర్యలు అవసరం.
 
ఫాబ్లీ యొక్క అల్గారిథమ్‌ శక్తివంతమైన సాంకేతిక ఆధారిత ప్రవర్తనా మార్పులు, స్మార్ట్‌ఫోన్‌ ద్వారా అమలు చేయబడుతుంది, ఇది దీర్ఘకాలిక వ్యాధి రోగులకు అవసరమయ్యే స్థిరమైన సహచరునిగా నిలుస్తుంది. స్మార్ట్‌ఫోన్స్‌, వేరబల్స్‌ మరియు మానిటరింగ్‌ ఉపకరణాలు వినియోగించి, రోగులు తమ ఆరోగ్య లక్షణాలను స్వయంగా పర్యవేక్షించుకోవడంతో పాటుగా ఫాబ్లీ యాప్‌కు నివేదించవచ్చు. ఫాబ్లీ యొక్క ప్రొప్రైయిటరీ అల్గారిథమ్‌ ఈ ఆరోగ్య వివరాలను తీసుకోవడంతో పాటగా ప్రవన్తనా మార్పు, రోగులలో చికిత్సకు కట్టుబడి ఉండేందుకు అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి తగిన చర్యలను సూచిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన  పడిన రోగులు తమ ఆరోగ్యంపై పూర్తి నియంత్రణను ఫాబ్లీతో పొందగలరు. దీనికి 17వేల మందికి పైగా డాక్టర్ల నైపుణ్యం, అనుభవం తోడు కావడం వల్ల భారతదేశ వ్యాప్తంగా 4.5 మిలియన్ల మంది భారతీయుల ఆరోగ్య ప్రయాణంలో తోడ్పడగలుగుతుంది.
 
దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత పర్యవేక్షణ ప్రయోజనాలను స్వీకరించేందుకు మార్గాలు అనేకం, వైవిధ్యం. అందువల్ల, రోగులు మరియు డాక్టర్లు ఒకే రీతిలో వీటిని స్వీకరించాల్సి ఉంటుంది. ఫాబ్లీ యొక్క ఇటీవలి అధ్యయనాలు దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో డీటీఎక్స్‌ ప్రభావం వెల్లడించింది.
 
టైప్‌ 2 మధుమేహం
టైప్‌ 2 మధుమేహ నిర్వహణలో డిజిటల్‌  థెరపాటిక్స్‌ పాత్రపై అధ్యయనంను 12 వారాల పాటు టైప్‌ 2 మధుమేహ రోగులపై నిర్వహించారు. డీటీఎక్స్‌ ఇంటర్వెన్షన్‌లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఇంటరాక్టివ్‌ మరియు డైట్‌, ఫిజికల్‌ మూవ్‌మెంట్‌, ఆరోగ్య విద్య అల్గారిథమ్‌ మేనేజ్‌మెంట్‌; ఫాబ్లీ యాప్‌ ద్వారా స్వీయ పర్యవేక్షణ ఉంటాయి. ఈ అధ్యయనం కనుగొన్న దాని ప్రకారం టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న రోగులు గణనీయంగా ప్రయోజనం పొందారు. అది వారి హెచ్‌బీఏ1సీ విలువలలో (గత మూడు నెలల కాలంలో బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయిల సరాసరి) క్షీణత ద్వారా కనిపించింది. 12 వ వారపు చివరలో ఈ ఫలితాలు చూశారు. మరీ ముఖ్యంగా మధుమేహ తీవ్రత అధికంగా కలిగిన రోగులలో బ్లడ్‌ షుగర్‌ నియంత్రణ పరంగా గణనీయంగా మెరుగుదల కనిపించింది. అంతేకాదు గత సంవత్సర కాలంలో టైప్‌ 2 మధుమేహం గుర్తించబడిన రోగులలో డిజిటల్‌ థెరపాటిక్‌ జోక్యం వల్ల మరింత ఉన్నతంగా ప్రయోజనాలు కనిపించాయి.
 
ఈ ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, 12 వారాల తరువాత, హెచ్‌బీఏ1సీ స్థాయి 8% కంటే ఎక్కువగా ఉన్న రోగులలో హెచ్‌బీఏ1సీ మార్పు -1.45%గా ఉంది. అంతేకాదు, ఒక సంవత్సరం లోపులో మధుమేహం బారిన పడిన రోగులలో ఈ  హెచ్‌బీఏ1సీ మార్పు -1.96%గా ఉంది. ఈ ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ నమూనాలతో పోలిస్తే ఫాబ్లీ యొక్క డీటీఎక్స్‌ ఆధారిత జోక్యం మరింత ప్రభావవంతంగా ఉండటంతో పాటుగా ప్రవర్తనా మార్పు, మధుమేహ రోగులలో స్వీయ నియంత్రణ ద్వారా బ్లడ్‌ షుగర్‌ నియంత్రణ సైతం మెరుగుపడింది.
 
హైపర్‌టెన్షన్‌
రక్తపోటు నియంత్రణపై అధ్యయనాన్ని స్ధిరమైన చికిత్సతో అనియంత్రిత రక్తపోటు కలిగిన రోగులు (బీపీ 140/90 కంటే ఎక్కువ లేదా సమానం)పై 12 వారాల పాటు నిర్వహించడం జరిగింది. డీటీఎక్స్‌ కింద చేయబడిన జోక్యాలలో హైపర్‌టెన్షన్‌కు సంబంధించి ప్రొప్రైయిటరీ అల్గారిథమిక్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా డైటరీ మార్పులు, ఒత్తిడి నిర్వహణ, శారీరక శ్రమ, రోగులకు అవగాహన, స్వీయ పర్యవేక్షణ ఉన్నాయి.
 
ఈ ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం రోగులలో సరాసరిన రక్తపోటు 28/19 ఎంఎంహెచ్‌జీ తగ్గింది. వీరి బేస్‌ లైన్‌ రీడింగ్‌ 155/100 ఎంఎంహెచ్‌జీ నుంచి 127/82 ఎంఎంహెచ్‌జీకి చేరింది. రోగులలో 82.4% మంది యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ (ఈఎస్‌సీ) మరియు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌  మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సూచనీయ లక్ష్యమైన సిస్టోలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌ 140ఎఎంహెచ్‌జీ కంటే  తక్కువ రక్తపోటు కలిగి ఉన్నారు. అంతేకాదు 67.6% మంది రోగులు 140/90 ఎంఎంహెచ్‌జీ కంటే తక్కువ రక్తపోటు స్ధాయిలను చేరుకున్నారు. అలాగే 35.2 % మంది కోరుకున్న రక్తపోటు స్ధాయి 130/80 ఎంఎంహెచ్‌జీ కంటే తక్కువ స్ధాయి చేరుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, హైపర్‌ టెన్షన్‌ తీవ్రత పెరిగితే, రక్తపోటు తగ్గింపు పరంగా ప్రయోజనాలు సైతం వృద్ధి చెందుతున్నాయి.
 
ఈ ఫలితాలు అత్యంత స్పష్టంగా రక్తపోటు విలువలను మెరుగుపరచడంలో ఫాబ్లీ యొక్క డీటీఎక్స్‌ జోక్యం ప్రభావాన్ని వెల్లడిస్తుంది. ప్రవర్తనా పరమైన మార్పులు, హైపర్‌ టెన్షన్‌ స్వీయ నిర్వహణతో ఇది సాధ్యమవుతుంది. ఈ క్లీనికల్‌ అధ్యయనాల ఫలితాలను గురించి ఫాబ్లీ హెల్త్‌ స్ట్రాటజీ లీడ్‌ డాక్టర్‌ సుహాస్‌ పాటిల్‌ మాట్లాడుతూ ‘‘మనం ప్రతి రోజూ వినియోగించే స్మార్ట్‌ఫోన్‌తో చికిత్సలో ఖచ్చితత్త్వం మరియు చికిత్స యొక్క  వ్యక్తిగతీకరణ ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల పర్యవేక్షణ, నిర్వహణ సాధ్యమవుతుందని ఈ అధ్యయన ఫలితాలు తిరస్కరించలేని రీతిలో వెల్లడించాయి. మొబైల్‌ అప్లికేషన్‌లు, ఎనలిటిక్స్‌ వినియోగించేటటువంటి డీటీఎక్స్‌, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని పొందడంలో సహాయపడుతుంది. నిలకడగా డీటీఎక్స్‌ జోక్యంతో, కొంతకాలానికి, రోగులు ఔషదాలపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ అధ్యయనాలు ఆరోగ్యవంతమైన జీవితాలను గడపడంలో డీటీఎక్స్‌ స్వీకరణ ప్రాముఖ్యత, ఆవశ్యకతను తెలియజేస్తాయి’’ అని అన్నారు.