మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (17:08 IST)

వర్షాకాలం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారా?

వర్షాకాలం వచ్చిందంటే రోగాలు వ్యాప్తి చెందుతాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా దగ్గు, జలుబు, జ్వరాలు అనేక మందికి వస్తాయి. హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దీనికి కారణం వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. మనం తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి ద్వారా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. 
 
సాధారణంగా పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తారు. ఇది నిజమే అయినప్పటికీ వర్షాకాలంలో మాత్రం పచ్చి కూరగాయలు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎంటుకంటే ఈ కాలంలో ఉండే తేమ వాతావరణం వలన వాటిపై బ్యాక్టీరియా, వైరస్‌లు అధికంగా చేరతాయి. అలాంటి కూరగాయలు తింటే ఇన్‌ఫెక్షన్‌లు వస్తాయి. 
 
కాబట్టి శుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. మనం పచ్చిగా తినే క్యారట్, టమోటా, బీట్‌రూట్, బెండకాయి వంటి కూరగాయాలను ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
 
ఎందుకంటే ఈ సీజన్‌లో ఉండే తేమ వాతావరణం వల్ల కూరగాయలపై అధిక సంఖ్యలో బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పచ్చిగా తింటే.. ఇన్‌ఫెక్షన్ల బారిన పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురి కావల్సి వస్తుంది. కనుక మనం పచ్చిగా తినే క్యారెట్, టమాటా, బీట్‌రూట్.. తదితర కూరగాయాలను ఉడికించి తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు..!