శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (13:51 IST)

ఓమీసోనిక్ వైర్‌లెస్ పరికరం వల్ల ప్రయోజనాలు

వర్షాకాలం కదా! మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కాయగూరలు ఏవైనా సరే మట్టితో ఉంటాయి. 
 
కాబట్టి బాగా శుభ్రం చేయాలి. రెట్టింపు నీటిని వాడాలి. శుభ్రం చేయడానికి పట్టే సమయమూ ఎక్కువే. అంత చేసినా నీరు, మట్టితో వచ్చే ఏ బ్యాక్టీరియా వల్లనైనా అనారోగ్య సమస్యలొస్తాయేమోననే అనుమానం వెంటాడుతుంది. 
 
ఈ సమస్యలేమీ లేకుండా సులభంగా బ్యాక్టీరియా, మురికిని తొలగించే అవకాశం ఉంటే బాగుండును కదా? ఓమీసోనిక్ వైర్‌లెస్ పరికరం మీకా సదుపాయం కల్పిస్తుంది. చూడ్డానికి పెద్ద స్టీల్ నాణెంలా ఉండే ఓమీసోనిక్ పరికరాన్ని వాడటం చాలా తేలిక.
 
ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కాయగూరలు వేసి ఈ పరికరాన్ని ఉంచితే సరి. నిమిషాల్లో కాయగూరలకంటిన మట్టి, బ్యాక్టీరియా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల బాధ ఉండదు. శుభ్రం చేయడానికి అయ్యే సమయమూ ఆదా అవుతుంది.