శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 14 అక్టోబరు 2020 (22:50 IST)

ఈ పదార్థాల్లో కల్తీ, తింటే ఏమవుతుందో తెలుసా?

పప్పు దినుసులలో కల్తీ రంగులు, తక్కువ ఖరీదు కల కేసరి పప్పును కలుపుతారు. దీనివలన పక్షవాతం వచ్చే ప్రమాదం వుంది.
 
పసుపు, కారం తదితరాల్లో కల్తీ రంగులు, రంపపు పొట్టు, తవుడు కల్తీ చేస్తారు.
 
మిఠాయిల్లో శాక్రిన్ అనే పదార్థాన్ని కలుపుతారు. దీని మోతాదు ఎక్కువయితే జన్యు సంబంధమైన వ్యాధులు, అజీర్తి, కడుపునొప్పి వస్తాయి.
 
శనగ పిండి, పెసర పిండి, కంది పిండి వంటి వాటిలో కేసర పప్పు లేక ఎర్రపప్పు పిండిని కల్తీ చేస్తారు. దీనివల్ల పక్షవాతం, బెరిబెరి వ్యాధులు వచ్చే ప్రమాదం వుంటుంది.
 
వంట నూనెలలో ఆముదం, అరియ నూనె తదితరాలు కల్తీ చేస్తారు. దీని వల్ల దురదలు, వాంతులు అవుతాయి. అందువల్ల నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలి.