శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (21:15 IST)

ఏ పండ్లను రసం తీసుకుని తాగాలో తెలుసా?

మనం పండ్లను తింటూ వుంటాం. ఐతే కొన్నిసార్లు వాటి రసాన్ని తీసి తాగుతుంటాం. ఐతే ఏ పండ్లను ఎలా తినాలో చాలామందికి తెలియదు. బత్తాయి, నారింజ, కమలా, అనాస మొదలైన వాటిని రసంగా తీసుకోవాలి. ఆ రసంలో పంచదారం, బెల్లం, వేయకుండా 2 లేదా 3 స్పూన్ల తేనె వేసుకోండి. రసాలలో ఎప్పుడూ ఐస్ వాడకూడదు. నారింజ రసం రోజూ తాగడం మంచిది. రోడ్లపై అమ్మే వాటికంటే ఇంట్లోనే తయారుచేసే జ్యూస్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కాలంలో తేలికగా జీర్ణమయ్యే, త్వరగా శక్తినిచ్చే పండ్లను తినడం మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారు జామ, దానిమ్మ, బత్తాయి, నారింజ, పుల్లటి రేగి కాయలు, నేరేడుపండ్లు తింటే షుగరు పెరగదు. బరువు తగ్గవలసిన వారు అరటిపండ్లను మానండి. 
 
మామిడి, సపోటా, సీతాఫలం, పనసతొనలు వాటిని ఎక్కువగా తినదలచినప్పుడు సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో సరిపడా తిని ఆ రోజు భోజనం మానండి. ఖరీదైన పండ్లు కొనలేని వారు రోజూ సాయంత్రానికి స్నాక్స్‌గా తీసుకునే రెండేసి జామకాయలు తిన్నా సరిపోతుంది. అయితే అందులో ఉప్పు- కారం మాత్రం ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.