బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (22:05 IST)

డ్రాగన్ ఫ్రూట్‌ ఆరోగ్య ప్రయోజనాలు..

Dragon Fruit
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని సెల్-డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
 
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును, ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, చర్మాన్ని కాపాడతాయి. అకాల వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్‌లోని ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. 
 
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది వేడి వాతావరణంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. 
 
వ్యాయామం తర్వాత శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒక అద్భుతమైన ఎంపిక. డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ ఇందులో విటమిన్లు, మినరల్స్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.