గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 నవంబరు 2022 (15:11 IST)

క్రమం తప్పకుండా ఓ గుప్పడు బాదములను తింటే మధుమేహం రాకను నివారించవచ్చు

Almonds
ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 14వ తేదీన అంతర్జాతీయ మధుమేహ దినోత్సవాన్ని ఈ వ్యాధి పట్ల అవగాహన మెరుగుపరచడానికి జరుపుతుంటారు. దేశంలో మధుమేహ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దానితో పాటుగా అతి తీవ్రమైన ఆరోగ్య ఆందోళనగానూ పరిణమిస్తుంది. 2021లో అంతర్జాతీయ డయాబెటీస్‌ ఫెడరేషన్‌ విడుదల చేసిన నివేదికల ప్రకారం, భారతదేశంలో 74 మిలియన్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌- ఇండియాడయాబెటీస్‌ (ఐసీఎంఆర్‌-ఇండియాబీ) అధ్యయాన్ని భారతదేశంలో 15 రాష్ట్రాలలో నిర్వహించింది. మొత్తంమ్మీద 10.3% మంది ప్రీ-డయాబెటీస్‌ స్థితిలో ఉండగా, 7.3% మంది డయాబెటీస్‌ స్థితిలో ఉన్నారు. ఇది మధుమేహ స్థితి పట్ల మరింతగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది.

 
టైప్‌ 2 మధుమేహ స్ధితిని నివారించడానికి ప్రీ డయాబెటీస్‌ నిరోధించడం అత్యంత కీలకం. అతి చిన్నవే అయినప్పటికీ, మన జీవనశైలిలో తగిన మార్పులు అంటే చురుగ్గా ఉండటం, ఆరోగ్యవంతమైనది తినడం వంటివి ప్రీ డయాబెటీస్‌ను నివారించడం లేదా దానిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం  ప్రొటీన్‌ అధికంగా తీసుకోవడంతో పాటుగా కార్బోహైడ్రేట్స్‌ను తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల  శరీరంలో బ్లడ్‌ షుగర్‌  లెవల్స్‌ స్థాయిలను మార్చడం సాధ్యమవుతుంది. ఆ తరహా ఆహారాలలో గింజల్లాంటి బాదం ఒకటి.

 
బాదములలో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉంది. దీనిలో పలు పోషకాలు అయినటువంటి ప్రొటీన్‌, డైటరీ ఫైబర్‌, చక్కటి ఫ్యాట్స్‌‌తో పాటుగా అతి ముఖ్యమైన విటమిన్స్‌, మినరల్స్‌ అయిన విటమిన్‌ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి బాదములను ఆరోగ్యవంతమైన స్నాక్‌గా మలచడంతో పాటుగా ప్రీ డయాబెటీస్‌ లేదా టైప్‌ 2 మధుమేహులకు ఆరోగ్యవంతమైన స్నాక్‌గా నిలుస్తుంది. ఆరోగ్యవంతమైన మీల్‌ ప్లాన్‌లో భాగంగా ప్రతిరోజూ బాదములను తినడం వల్ల అవి విస్తృత శ్రేణిలో ఆరోగ్యవంతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో బరువు నియంత్రణ మొదలు గుండె ఆరోగ్యం మెరుగుపరచడం వంటివి ఉన్నాయి.

 
ఫిట్‌నెస్‌ మరియు సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘అనారోగ్యవంతమైన జీవనశైలి కారణంగా మధుమేహం లాంటి సమస్యలు వస్తాయి.  సరికాని ఆహారపు అలవాట్లు, ఇతర కారణాలు కూడా మధుమేహానికి కారణమవుతాయి. అయితే, కొన్ని సరళమైన అంశాలను క్రమం తప్పకుండా అనుసరించడంతో పాటుగా ఫిజీషియన్ల సూచనలు పాటిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఉదాహరణకు, ఒకరు నిలకడతో కూడిన వర్కవుట్‌ ప్లాన్‌ను అనుసరించడంతో పాటుగా మీరు ఆస్వాదించతగిన వ్యాయామ ప్రణాళిక  అనుసరిస్తే మీరు ఫిట్‌గా ఉండటంతో పాటుగా స్ఫూర్తివంతంగానూ ఉండగలరు.

 
నా సలహా ఏమిటంటే, ఒకవేళ మీరు ఓ విధమైన నృత్య రీతిని ఆస్వాదించినా లేదంటే పరుగు పెట్టడం ఇష్టమైన లేదంటే ఈత కొట్టడం ఇష్టమైనా లేదా ఏరోబిక్స్‌ చేయడం ఇష్టమైతే దానినే చేయండి. ముందుగా చెప్పినట్లుగా మీ శరీర ఎండ్యూరెన్స్‌ మరియు మీ శరీర అవసరాలకు తగినట్లుగా మీ ఫిజీషియన్‌ సలహా మేరకు మీ ఫిట్‌నెస్‌ ప్లాన్‌ ఎంచుకోవాలి. దీనితో పాటుగా, అనారోగ్యకరమైన స్నాక్స్‌ స్ధానంలో ఆరోగ్యవంతమైన బాదములు లాంటి స్నాక్స్‌ను ఎంచుకోవడం మంచిది. బాదములు మీ స్నాక్స్‌ లేదంటే వర్కవుట్‌ అనంతర భోజనాలను రుచికరంగా మారుస్తాయి. మీ ఆకలిని ఇది పూరించడం మాత్రమే కాదు, క్రమం తప్పకుండా బాదములను తినడం వల్ల మజిల్‌ నిర్వహించడమూ సాధ్యమవుతుంది’’ అని అన్నారు.

 
పెద్ద వయసు వారిలో ప్రీ డయాబెటీస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘2018లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో 14% మంది ప్రీ డయాబెటీస్‌ స్ధితిలో ఉన్నారు. ప్రీ డయాబెటీస్‌ నుంచి డయాబెటీస్‌గా మారుతున్న వారిలో అధికశాతం మంది భారతీయులు. (దాదాపు 14-18%). జీవనశైలి పరంగా కొద్దిగా మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. బాదములను తీసుకోవడం ఓ చక్కటి మార్పుగా చెప్పవచ్చు. యుక్త వయసు లేదంటే పెద్ద వయసు వ్యక్తులలో గ్లూకోజ్‌ మెటబాలిజం మెరుగుపడటంలో ఇది తోడ్పడుతుంది. నిజానికి, ఇటీవల  నిర్వహించిన ఓ అద్యయనం వెల్లడించిన దాని ప్రకారం, ఆరోగ్యవంతమైన డైట్‌లో బాదములు తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన ఆహార వ్యూహంగా నిలుస్తుంది. దీనివల్ల యువతలో ప్రీ డయాబెటీస్‌ నివారించడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
 
 
సుప్రసిద్ధ టెలివిజన్‌ మరియు చిత్ర నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ, ‘‘ఓ నటిగా ఎప్పుడూ ఫిట్‌గా ఉండటం అవసరం. విస్తృత శ్రేణిలో జీవనశైలి రుగ్మతలు మనల్ని పట్టి పీడిస్తోన్న కారణంగా మనం ఫిట్‌నెస్‌ మరియు మంచి ఆరోగ్యం కోసం తీవ్రంగా శ్రమించాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని నివారించడం మరియు పౌష్టికాహారం తీసుకోవడం అవసరం. నేను వ్యక్తిగతంగా సరైన ఆహారం తీసుకోవడంపై అధికంగా దృష్టి సారిస్తుంటాను. అది మీల్స్‌ అయినా లేదంటే స్నాక్స్‌ అయినా, దానిలో మార్పు ఉండదు. అంతేకాదు, మా ఇంటిలో పెద్దవయసు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు మధుమేహంతో బాధపడుతున్నారు. అందువల్ల నేను ప్రతి రోజూ డైట్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాను. అది నాతో పాటుగా నా కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగుపరిచే రీతిలో ఉంటుంది. నేనెప్పుడూ కూడా అనారోగ్యవంతమైన ఆహారం నివారించడంతో పాటుగా ఓ చిన్న బాక్స్‌ బాదములను నాతో పాటుగా తీసుకువెళ్తుంటాను. ఓ గుప్పెడు బాదములు మరియు వీటితో పాటుగా కొన్ని రకాల నట్స్‌, ఫ్రూట్స్‌ లేదంటే మోనాటనీ పోగొట్టుకోవడానికి వాటిని ఇతర స్నాక్స్‌తో  జోడిస్తుంటాను. ప్రతి రోజూ  బాదములు తినడం వల్ల విటమిన్‌ ఈ,  ప్రొటీన్‌, కాల్షియం,  ఐరన్‌ లాంటి అత్యవసర  పోషకాలు నాకు లభిస్తున్నాయి. చక్కటి ఆరోగ్య నిర్వహణలో ఇవి అత్యంత ప్రయోజనకారిగా ఉంటాయి’’ అని అన్నారు.