శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (13:41 IST)

శృంగారానికి ముందు మద్యం సేవిస్తున్నారా?

పడక గదిలో భార్యతో ఎక్కువ సేపు గడపాలని ప్రతి ఒక్క మగాడు ఆశపడుతాడు. అంటే, శృంగారంలో ఇరగదీసి.. భార్య వద్ద మంచి మార్కులు కొట్టేయాలని కోరుకుంటారు. మరికొందరు మద్యం సేవిస్తే మంచి పవర్ వస్తుందని, అపుడు ఇరగదీయవచ్చని భావిస్తారు. తీరా పడక గదిలోకి వెళ్లగానే తుస్సుమంటున్నారు. ఈ కేవకు చెందిన వారు అనేక మంది ఉన్నారు. నిజానికి శృంగారానికి ముందు మనం తీసుకునే ఆహారం కూడా శృంగారంపై మంచి ప్రభావం చూపుతుంది. సంభోగానికి ముందు మీరు ఏం తింటున్నారా అనే దానిపై మీ శృంగార సామర్థ్యం ఆధారపడి ఉంటుందట. అన్నిటికంటే ప్రధానంగా సెక్స్‌లో పాల్గొనేముందు మద్యం అస్సలు ముట్టుకోరాదని నిపుణులు సూచిస్తున్నారు. 
 
సాధారణంగా మద్యపానం విశ్రాంతికి బాగా దోహదం చేస్తుంది. కానీ అవసరానికి మించి తాగడం వల్ల మీ లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది, నాడీ వ్యవస్థ పనితీరును కూడా తగ్గిస్తుంది. రక్త ప్రసరణ, నరాల సున్నితత్వంపై ప్రభావితం చూపుతుంది. ఫలితంగా శృంగారంలో ఎక్కువ సేపు సెక్స్ చేయలేరు. 
 
అలాగే, సంతృప్త కొవ్వులు(సాచురేటెడ్ ఫ్యాట్స్) అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా అధికంగా తీసుకోరాదు. ముఖ్యంగా, అధిక కొవ్వు ఉండే గొడ్డు మాంసం, వెన్న వంటి ఆహారాలు కాలక్రమేణా ప్రసరణను దెబ్బతీస్తాయి. ఇది లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది. వీటిని తినడం వల్ల శృంగారం చేసే సమయంలో అసహ్యకరమైన వాసన వస్తుంది. ఇది శృంగారంలో పాల్గొనే స్త్రీపురుషులకు ఇబ్బందికరంగా ఉంటుంది.