శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (21:01 IST)

తేనెతో కలిపి వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే..?

వెల్లుల్లిని రోజూ పరగడుపున తీసుకుంటే.. పలు సమస్యలను దూరం చేసుకోవచ్చు. తేనేతో కలిపి వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే బాడీలోని బ్యాక్టీరియా, వైరస్‏లను సులభంగా తొలగించుకోవచ్చు. రోజు వెల్లుల్లిని తీసుకోవడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గిస్తుంది. 
 
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకోవడం వలన కడుపులో ఉండే హానికారక బ్యాక్టీరియా సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే న్యూమోనియా సమస్య కూడా తగ్గుతుందట. అంతేకాకుండా. జ్వరం, ఉబ్బసం, కాలేయ సమస్యలకు కూడా వెల్లుల్లి తీసుకోవడం వలన వీటిని రాకుండా చేసుకోవచ్చు. 
 
ఇంకా హైబీపీ సమస్య ఉన్నవాళ్ళు వెల్లుల్లి తీసుకోవడం వలన ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గుండె సంబంధింత సమస్యలను వెల్లుల్లి నివారిస్తుందట. ఛాతీ సంబంధిత సమస్యల భారిన పడకుండా వెల్లుల్లి రక్షిస్తుంది. శరీరంలో వాపులు, నొప్పులు ఉన్నచోట వెల్లుల్లి రసంతో మర్ధన చేస్తే ఆ సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే చలికాలంలో వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజువారి ఆహార పదార్థాల్లో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే శరీర ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత అంతగా ఉండదు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫ్రీ ర్యాడికల్స్‌ కారణంగా మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడానికి వెల్లల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది.ట
 
వెల్లుల్లిలోని అల్లిసిన్‌.. రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. ఒక గ్లాస్‌ నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి.