చినుకులు పడుతున్న వేళ.. అల్లం టీ తాగితే?
వేసవి కాలం పోయి.. చినుకులు పడుతున్నాయి. ఈ సీజన్లో అల్లం టీని సేవిస్తే జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది.
వేసవి కాలం పోయి.. చినుకులు పడుతున్నాయి. ఈ సీజన్లో అల్లం టీని సేవిస్తే జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. అల్లం టీని రోజూ తీసుకోవడం ద్వారా బీపీ కూడా బాగా తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను, నొప్పిని అల్లం టీ నివారిస్తుంది.
కండరాలు, కీళ్లనొప్పులూ ఆర్థ్రయిటిస్ సమస్యలు ఉన్నవాళ్లకి అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి.
అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగించి.. గుండె వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.