మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (09:21 IST)

ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి..

రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలన్న అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే... ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలని కాకుండా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలన్న అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే... ఏదో ఒక అల్పాహారం తీసుకోవాలని కాకుండా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం సంగతి దేవుడెరుగ... అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
 
అందువల్ల ప్రతి రోజూ అల్పాహారంగా ప్రతిరోజు మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె లేకుండా చపాతీలు, పండ్ల రసాలే కాక.... ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలగలిపిన సలాడ్‌లు వంటివి తీసుకుంటుంటే అనారోగ్యాన్ని కలిగించే వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు దాదాపు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.
 
వీటితో పాటు.. తీసుకునే అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధికమించడమేకాకుండా, జ్ఞాపకశక్తి పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డైటింగ్ చేసే వారు నిర్లక్ష్యం చేయకుండా.. అల్పాహారం తీసుకోవడం మరువకూడదని హెచ్చరిస్తున్నారు.