సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (22:49 IST)

ఇలా చేస్తే మస్తు మజా నిద్రపడుతుంది

రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా...? అయితే చక్కగా ఉన్ని పైజామా వేసుకుని పడుకోండి. చక్కగా నిద్రపోతారు. ఇది ఉత్తినే చెప్పే మాటకాదు. పరిశోధకులు ప్రత్యేక అధ్యయయాన్ని నిర్వహించి మరీ ఉన్ని పైజామా చక్కటి నిద్ర పట్టేలా చేస్తుందని కనుగొన్నారు.
 
సాధారణంగా మన శరీరానికి కాటన్‌ దుస్తులు చాలా మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అయితే కాటన్‌కన్నా ఉన్ని మరింతగా మన శరీరానికి మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మిరిమ్‌షిన్‌ ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఉన్ని పైజామాలను ధరించడం వల్ల గాఢమైన నిద్రకు అది ఎంతగానో ఉపకరిస్తుందని తేలింది.
 
తేలికగా ఉండే ఉన్ని పైజామాలు ధరించడం వల్ల నిద్ర పట్టడమేకాకుండా పడకకు సంబంధించి ఉపయోగించే వాటిలో కూడా ఉన్ని వస్త్రాలు చాలా మెత్తగా ఉంటూ త్వరగా నిద్ర పట్టేలా చేస్తాయని ఆమె చెబుతున్నారు. కాటన్‌కన్నా ఉన్ని శోషణ ధర్మాన్ని కలిగివుంటుందని, సుదీర్ఘ నిద్రకు 22 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకంటే 17 డిగ్రీల ఉష్ణోగ్రత అనువుగా ఉంటుందని, త్వరగా నిద్ర పట్టడంలో ఈ ఉష్ణోగ్రత ప్రభావం కూడా ఉన్నితో ఉంటుందని ఆమె చెబుతున్నారు.