అంటువ్యాధులను అడ్డుకునే జామకాయలు
జామ కాయలు ఏడాది మొత్తం అందుబాటులో వుండే పండు. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి.
వీటిలో మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసరమైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి.
జామ ఆకులు, బెరడు నుంచి తయారుచేసిన పదార్థాలు కేన్సర్, బాక్టీరియా ద్వారా వచ్చే అంటువ్యాధులు, వాపులు- నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారుచేసిన నూనెలు ఎన్నో ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా జామ బాగా మేలు చేస్తుంది.