ఇన్ఫెక్షన్లకు బైబై.. రోగ నిరోధక శక్తికి మామిడి పండ్లు.. పిల్లలకు చెప్తే?
పిల్లలకి మామిడి పండ్లు పెట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా తక్షణ శక్తిని ఇచ్చి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లను పిల్లలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు ఉండవు. బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటితో ఇది పోరాడుతుందని నిపుణులు చెప్పారు.
పండిన మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదేవిధంగా దీనిలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ఎనిమిది నుండి పది నెలలు దాటిన పిల్లలకి మామిడి పండ్లు పెట్టవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయేరియా వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫిజికల్లీ వీక్‌గా ఉండే వాళ్ళకి మ్యాంగో షేక్ చేసి ఇస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.