సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (15:41 IST)

పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వద్దు బాబోయ్..

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఎలక్ట్రానిక్ స్ర్కీన్లు అలవాటు చేస్తూ పోతే.. అతిగా బరువు పెరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు చెప్తున్నారు. 
 
అధిక బరువు ఉన్నవారిలో ఎక్కువగా అకాల మరణాల నుంచి గుండెజబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిరకాల క్యాన్సర్లు పుట్టుకుచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సమయానికి కంటి నిండా నిద్రపోయేలా వాతావారణాన్ని కల్పించాలి. జీవితాంతం అదే అలవాట్లను అలవరుచుకునేలా చూడాలి. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర వ్యాధుల నుంచి బయటపడవచ్చు. 
 
ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలు రోజులో కనీసం మూడు గంటల పాటు వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలని సూచించారు. ఏడాదిలోపు శిశువులతో నేలపై ఆడే ఆటలు ఆడించాలి. ఎలక్ట్రానిక్ స్ర్కీన్లను దూరంగా పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
 
ఏడాది కంటే తక్కువ వయస్సు.. శిశువులను ఎలక్ట్రానిక్ స్ర్కీన్లను ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఉంచకూడదు. వీటివల్ల రేడియేషన్ ప్రభావం శిశువులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా వారితో ఆటలు ఆడించాలని వైద్యులు సూచిస్తున్నారు.