శుక్రవారం, 21 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2024 (22:00 IST)

వేసవిలో మజ్జిగ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది.
మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి.
మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి.
ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది.
మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
పోషకాలతో నిండిన పెరుగులో పంచదార కలిపి చేసే లస్సీ కూడా మేలు చేస్తుంది.