గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 18 డిశెంబరు 2021 (23:26 IST)

తేనె-జున్ను కలిపి తీసుకుంటే?

జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి. 

 
జున్నులోని విటమిన్ బి2, ఎ, కె, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపవుతుంది. జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. తరచూ దీనిని తింటే.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

 
జున్ను విరేచననాలు, మలబద్దక సమస్యలను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు.. రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో విటమిన్ డి కారణంగా ఆస్టియోపోరోసిస్ లోపానికి గురికావలసి వస్తుంది. ఈ లోపాన్ని తొలగించాలంటే.. జున్ను తీసుకోవాలి. జున్నులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఈ లోపాన్ని తొలగించుటలో ఎంతో దోహదం చేస్తుంది.