శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 జులై 2020 (13:33 IST)

ఒబిసిటీ అంటే కరోనాకు గిట్టదట.. బరువు తగ్గితేనే.. ఆ ప్రమాదం..?

Obesity
కరోనాకు ఒబిసిటీ అంటే గిట్టదట. ఊబకాయం ఉన్నవారికి కరోనా వైరస్ వల్ల చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి హెలెన్ వాట్లీ హెచ్చరించారు. అందువల్ల బ్రిటన్‌ ప్రజలు బరువు తగ్గాలని, దీనికోసం తక్కువగా తినాలని సూచించారు. 40కిపైగా మాస్ ఇండెక్స్ ఉంటే కరోనా వల్ల చనిపోయే ప్రమాదం రెండింతలు పెరుగుతుందని చెప్పారు. 
 
కరోనా మరణాన్ని తప్పించుకోవాలంటే తిండిని తగ్గించాలని పేర్కొన్నారు. శరీర జీవక్రియ, రోగనిరోధక శక్తి వ్యవస్థను అనుసంధానించే హార్మోన్‌కు శరీర మెటబాలిజానికి లింకు వుండటంతో ఒబిసిటీ వున్న వారికి సులభంగా కరోనా సోకే అవకాశం వుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
లెప్టిన్ అనే హార్మోన్ ఆకలి, జీవక్రియను నియంత్రిస్తుంది. ఇది సంక్రమణతో పోరాడే కణాలను కూడా నియంత్రిస్తుంది. లెప్టిన్ కొవ్వు కణాల ద్వారా ఊపిరితిత్తులలోని కణజాలాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఒక వ్యక్తికి ఎంత కొవ్వు ఉందో, వారి శరీరంలో లెప్టిన్ ఎక్కువగా వుంటుంది. 
 
ఊబకాయం ఉన్నవారికి వారి లెప్టిన్ స్థాయిలు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటాయి. ఇది కోవిడ్ -19 సంక్రమణకు ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలివేటెడ్ లెప్టిన్ స్థాయిలు అంటువ్యాధులతో, ఊపిరితిత్తులతో పాటు ఇతర అవయవాల శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అధిక లెప్టిన్ స్థాయిలతో శరీరానికి ఇబ్బంది తప్పదు.
 
అందుకే ఊబకాయం వుంటే.. కోవిడ్-19 సంక్రమణతో పోరాడటం మరింత కష్టతరం అవుతుంది. ఇంకా అనారోగ్య సమస్యలు కూడా తప్పవని..  లూసియానాలోని పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ రచయిత జాన్ కిర్వాన్ అన్నారు. 
 
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబిసిటీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఈ లెప్టిన్ స్థాయిలు పెరిగితే.. రోగనిరోధక శక్తి తగ్గడం.. శరీరం ఎర్రబడిపోవడం.. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోవడం వంటి ప్రతికూల ఫలితాలు వుంటాయని అధ్యయనం తేల్చింది.