శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (13:25 IST)

హాయిగా నిద్రపోతే.. మెదడు శుభ్రం అవుతుంది.. తెలుసా?

నిద్ర ఎంత తగ్గితే ముప్పు అంత ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రను పక్కనబెట్టారో.. ఇక అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. జీవిత కాలంలో తక్కువగా నిద్రిస్తే అల్జి

నిద్ర ఎంత తగ్గితే ముప్పు అంత ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రను పక్కనబెట్టారో.. ఇక అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. జీవిత కాలంలో తక్కువగా నిద్రిస్తే అల్జిమర్స్‌ ముప్పు అంత ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఉద్యోగాల రీత్యా నిద్ర లేకుండా రేయింబవళ్లు పని చేసేవాళ్లు, గురక వంటి ఇతరత్రా సమస్యల కారణంగా సరిగా నిద్రపోలేని వాళ్లు, నిద్రలేమితో బాధపడేవాళ్లు.. హాయిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. లేకుంటే అల్జిమర్స్‌ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఈ సమస్యలకు చికిత్స తీసుకోవడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని, విషయ గ్రహణ శక్తి మెరుగుపడుతుందని.. వారు సూచిస్తున్నారు. 
 
నిద్ర పక్కాగా వుంటే అల్జిమర్స్‌ వంటి మతిమరుపు వ్యాధుల ముప్పును కొన్ని దశాబ్దాల పాటు వాయిదా వేసుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. పెద్దలకు కనీసం 7 నుంచి 9 గంటల రాత్రి నిద్ర అవసరమని, చిన్నారులకు తొమ్మిది నుంచి పది గంటల నిద్ర అవసరమని వైద్యులు చెప్తున్నారు. 
 
మెదడులోని గ్లింఫాటిక్‌ వ్యవస్థ కూడా రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నప్పుడే చురుకుగా తయారై మెదడు నుంచి వ్యర్థ రసాయనాలన్నింటినీ బయటకు నెట్టేస్తుంది. ఇవన్నీ మెదడు, వెన్ను చుట్టూ ఉండే ద్రవం ద్వారా మెదడు నుంచి బయటకు కొట్టుకొచ్చేస్తున్నాయి. 
 
నాడీ కణాల మధ్య పేరుకుపోయి, అల్జిమర్స్‌ వ్యాధికి కారణమయ్యే అమైలాయిడ్‌ ప్రోటీను కూడా- ఇలా నిద్రా సమయంలో మెదడును శుభ్రం చేసే క్రమంలో బయటకు వచ్చేయాల్సిన రసాయనమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే సమయానికి నిద్రించాలని.. 8 గంటలకు తగ్గకుండా హాయిగా నిద్రపోవాలని వారు సూచిస్తున్నారు.