గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 17 మార్చి 2020 (21:02 IST)

కొబ్బరితో ఎంత ఆరోగ్యం తెలిస్తే అస్సలు వదలరు..?

కొబ్బరిని తినడానికి చాలామంది ఇష్టపడరు. కొబ్బరిని వంటల్లో వాడితే కొంతమంది అస్సలు ఒప్పుకోరు. పచ్చికొబ్బరి తినాలన్నా, ఎండుకొబ్బరి తినాలన్నా కొంతమంది ముఖం చాటేస్తుంటారు. అయితే అలాంటి కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనం తెలిస్తే అస్సలు వదలరు అంటున్నారు వైద్య నిపుణులు. 
 
కొబ్బరి నీళ్ళలో ఎన్నో ఎనర్జీ డ్రింకులు కంటే అత్యధిక పొటాషియం, క్లోరైడు, చక్కెర, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. చిన్నపిల్లలకు, గర్భవతులకు అనారోగ్యులకు, పాలిచ్చే తల్లులకు అనేక పోషకాల్ని కొబ్బరి నీరు అందిస్తుంది. 
 
లేత కొబ్బరి రుచికి, పోషకాలకు పెట్టింది పేరు. అనేక రకాల వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్, ప్రోటోజోల్ రుగ్మతల నుంచి కాపాడగల గుణం కలిగి ఉంది. ట్రీ ఆఫ్ లైఫ్ గాను స్వర్గపు చెట్టుగా పిలువబడే ఈ చెట్టు ప్రతి భాగము ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె చర్మరోగాలను నయం చేయడంలోనూ, జట్టు పోషణకు వంటల్లోను ఔషధాలలోను వాడుతున్నారు. సబ్బుల తయారీల్లో కూడా వాడుతున్నారు.