రోజూ మీరు వందసార్లు నవ్వితే ఏం జరుగుతుందో తెలుసా?

Brahmanadam-smile
Last Modified శుక్రవారం, 7 జూన్ 2019 (17:14 IST)
నవ్వు నాలుగు విధాల చేటు అంటుంటారు మన పెద్దలు. కాని అదే నవ్వు మనికి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. నవ్వుతో అందం, ఆనందమే కాదు, నాజూగ్గా కూడా తయారవొచ్చని అంటున్నారు. రోజులో మీరు వందసార్లు నవ్వితే అది పావుగంట సైకిల్ తొక్కడంతో, పది నిమిషాలు రోయింగ్ మెషీన్‌పై వ్యాయామం చేయడంతో సమానమట.

నవ్వు ఒత్తిడిని కలిగించే హార్మోన్ల పనితీరును తగ్గిస్తుంది. అంతేకాదు చల్లని నీళ్ళలో స్నానం చేసినా సన్నబడొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే చల్లని నీళ్ళ వల్ల శరీరం వణుకుతుంది. దీనివల్ల కండరాల కదలికలు ఎక్కువుగా ఉంటాయి. తద్వారా రక్త ప్రసరణ వేగం కూడా పెరుగుతుంది.

వీటన్నింటి వల్ల కొన్ని కెలరీలు కరుగుతాయి. అందువలన లావు తగ్గడానికి పెద్ద పెద్ద బరువులు ఎత్తనవసరం లేదు. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. మరికెందుకు ఆలస్యం ఇక నుంచి హాయిగా నవ్వేయండి.దీనిపై మరింత చదవండి :