శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : గురువారం, 6 జూన్ 2019 (09:32 IST)

06-06-2019 మీ రాశిఫలాలు : మీ మాటకు సర్వత్రా...

మేషం : ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రదింపులు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించండి. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది.
 
వృషభం: కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
మిథునం: ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు ఎదుర్కొంటారు. బిల్లులు చెల్లిస్తారు.
 
కర్కాటకం : డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
 
సింహం: ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, కాంట్రాక్టులకు మరి కొంతకాలం ఆగటం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. స్థలమార్పు, వాస్తుదోష నివారణతో మంచి ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి.
 
కన్య: వృత్తి ఉపాధి పథకాలకు ప్రోత్సాహం లభిస్తుంది. చెక్కుల జారీ స్వీకరణలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ సిఫార్సుతో ఒకరికి చక్కని అవకాశం లభిస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
 
తుల: వస్త్ర, బంగారం, పచారీ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులు మీ నుంచి ధనసహాయం అర్థిస్తారు. సేల్స్ సిబ్బందితో లౌక్యంగా మెలగాలి. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకు సాదర వీడ్కోలు లభిస్తాయి.
 
వృశ్చికం: ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి, యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం చేతికి అందుతుంది.
 
ధనస్సు: కష్ట సమయంలో ఆత్మీయులు ఆదుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి స్వల్ప లాభాలు గడిస్తారు.
 
మకరం: సంతానం పై చదువులు, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫీజులు, పన్నులు, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి.
 
కుంభం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. డాక్టర్లు శస్త్రచికిత్సలు చేయునప్పుడు మెళకువ ఏకాగ్రత అవసరం. పెద్దల సాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలు, ఉపాధి పథకాలు ప్రశాంతంగా సాగుతాయి. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
 
మీనం: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. రుణాలు తీరుస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.