గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (09:53 IST)

04-06-2019 మీ దినఫలాల : ఉద్యోగస్తులు అధికారుల తీరు...

మేషం : కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలత. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు తలెత్తవచ్చును.
 
వృషభం : చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, జాప్యం వంటివి ఎదుర్కొంటారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి అవమానాలను పొందినా మంచి గుర్తింపు లభిస్తుంది.
 
మిథునం : మానసికస్థైర్యంతో అడుగు ముందుకేయండి, అనుకున్నది సాధిస్తారు. అరుదైన ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. శత్రువులను మీ వైపునకు ఆకట్టుంటారు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి.
 
కర్కాటకం : వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్పతేడాలుంటాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం భవిష్యత్ గురించి కొత్త కొత్త పథకాలు వేస్తారు. ప్రయాణాలు లక్ష్యం నెరవేరుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
సింహం : వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రావలసిన ధన ఆలస్యంగా అందడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. పరుషమైన మాటలు సంబంధాలన్ని దెబ్బతీస్తాయి.
 
కన్య : విద్యార్థులకు కొత్త వాతావరణం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులను ఎదుర్కొంటారు. మీరెంత శ్రమించినా గుర్తింపు అంతంతమాత్రంగానే ఉంటుంది. పెద్దలు, అయినవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
 
తుల : డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టే ముందు జాగ్రత్త అవరం. బంధుమిత్రులను కలుసుకుంటారు. భాగస్వామ్యుల మధ్య అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా పరిష్కరిస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రికా, సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
వృశ్చికం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పాత సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి.
 
ధనస్సు : గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మన్నలు పొందుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనం కోసం వెతుకులాడుకునే ఇబ్బంది ఉండదు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
మకరం : చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. రాజకీయాల్లో వారికి సంఘంలో పరపతి పెరగగలదు. రాబడికి మించిన ఖర్చులు పెరగడంతో రుణాలు, అదనపు రాబడికై అన్వేషిస్తారు.
 
కుంభం : మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదుర్కొంటారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరులను నమ్మించడానికి అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది.
 
మీనం : రాజకీయాలో వారు విరోధులుగా వేసే పథకాలను తెలివితో తిప్పిగొడతారు. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. మీ వాహనం ఇతరులకివ్వడం వల్ల కొత్త సమస్య లెదుర్కోవలసి వస్తుంది. పాత రుణాలు తీరుస్తారు.