మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 మార్చి 2021 (17:33 IST)

రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ యాపిల్స్ ఉత్తమమైనవా?

ఆకుపచ్చ యాపిల్ పండ్లలో చక్కెర, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ కె ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన రకంగా ముందంజలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ రెండింటి మధ్య తేడాలు చాలా స్వల్పంగా ఉంటాయి. పోషకాహార పరంగా ఉన్న ఏకైక పెద్ద వ్యత్యాసం విటమిన్ ఎ, ఇది ఎరుపు యాపిళ్లతో పోలిస్తే ఆకుపచ్చ యాపిళ్లలో దాదాపు రెండు రెట్లు ఎక్కువ.
 
గ్రీన్ యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. విటమిన్ ఎ, బి, సి వీటిలో వుండటం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగినప్పుడు అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా మారుతుంది. అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుపచ్చని యాపిల్స్‌ చక్కగా పనిచేస్తాయి. అంతేకాకుండా గ్రీన్ యాపిల్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడుతుంది. తద్వారా జీవక్రియను పెంచుతుంది.
 
గ్రీన్ యాపిల్స్‌లో ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం వంటి తదితర ఖనిజాలు వుంటాయి. ఇందులో వుండే ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచుతుంది. బరువు తగ్గాలనునుకునేవారికి గ్రీన్ యాపిల్ మంచి ఆహారం.
 
ఇందులో వుండే యాంటీ ఆక్సిడంట్లు కణాల పునర్నిర్మాణం, కణాల పునరుత్తేజానికి సాయపడతాయి. ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. ఇవి కాలేయం రక్షించడంలో మేలు చేస్తాయి.