బత్తాయి రసం అల్పాహారానికి ముందు తీసుకుంటే..?
వేసవిలో బత్తాయి రసం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతోంది. నీరసాన్ని, అలసటను బత్తాయి రసం పోగొడుతోంది. 12నెలల బిడ్డ నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ బత్తాయి రసాన్ని తీసుకోవచ్చు. శరీరాన్ని అలసట నుంచి దూరం చేసుకోవాలంటే బత్తాయి రసం తీసుకోవాలి. తద్వారా కొత్త ఉత్సాహం చేకూరుతుంది. ఇంకా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు బత్తాయి రసంను అప్పుడప్పుడు తీసుకోవాలి. తద్వారా శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది. డీహైడ్రేషన్‌కు బత్తాయి రసం దివ్యౌషధం. శరీర ఉష్ణోగ్రతను బత్తాయి రసం సక్రమంగా వుంచుతుంది. బత్తాయి రసం చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పచ్చకామెర్ల వ్యాధితో బాధపడేవారు బత్తాయి రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. బత్తాయి రసం అజీర్తిని నయం చేస్తుంది. బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా ఎముకలకు బలం చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.