ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 10 డిశెంబరు 2020 (15:28 IST)

నారింజ పండులో ఉన్న లాభాలేమిటో తెలుసుకుందాం

నారింజ పండును అందరూ ఇష్టపడి జ్యూస్ చేసి తాగుతుంటారు. సీజన్‌తో నిమిత్తం లేకుండా అన్ని సీజన్లో వీటిని తింటుంటారు. అయితే నారింజ పండును చలికాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ప్రతిరోజు ఒక గ్లాసు ఆరంజ్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
ఆరంజ్ పండు పోషకాలలో మెండు అంటారు. ఇందులో ఎక్కువగా కేలరీలు ఉంటాయి. నారింజలో ఎలాంటి కొలస్ట్రాల్ ఉండవు. ఇందులో డైటర్ పైబర్ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఉండే విషతుల్యాలు త్వరితంగా బయటపడుతాయి. ఆరంజ్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది.
 
నారింజలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ఒక సిట్రస్ ప్రూట్. సహజ సిద్దమైన ఆక్సిడెంట్స్ ఇందులో ఉండడం వలన రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నారింజలో విటమిన్ బీ కాంప్లెక్స్ అధింగా ఉండడం వల్ల రక్తంలొ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. నారింజలో ఉండే పోషకతత్వాలు ఎముకలను బలపరుస్తుంది.