శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (14:30 IST)

తామర గింజలు తీసుకుంటే లాభాలేమిటో తెలుసా?

తామర గింజలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని పూల్ మఖని అంటే అందరు గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్ అని కూడా అంటారు. ఈ గింజలు తామర పువ్వుల నుండి వచ్చినవి. వీటి

తామర గింజలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కాని పూల్ మఖని అంటే అందరు గుర్తుపడతారు. మఖని అంటే హిందీలో ఎండినవి అని అర్థం. వీటిని ఫాక్స్‌నట్స్ అని కూడా అంటారు. ఈ గింజలు తామర పువ్వుల నుండి వచ్చినవి. వీటిని పచ్చివిగా, వేయించుకుని ఉడకబెట్టి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చూచిస్తున్నారు.
 
ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే ఈ తామర గింజలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో వీటితో స్వీట్స్ కూడా తయారుచేసుకుంటారు. తామర గింజలు ఎండిన వాటికంటే పచ్చివాటిలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు, క్యాన్సర్ కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను దరిచేరకుండా చేస్తాయి.
 
ఇందులో ఉండే పీచు పదార్థం బరువు తగ్గేందుకు చాలా దోహదపడుతుంది. వీటిల్లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన దీనిని ఆహారంగా తీసుకుంటే బీపీని నివారించవచ్చును. గర్భిణుల, బాలింతలు వీటిని తీసుకుంటే నీరసం దరిచేదరు. రక్తహీనత గల రోగులకు ఇది ఒక మందుగా పనిచేస్తుంది. ఈ తామర గింజలు ఆకలిని పెంచుటకు సహాయపడుతాయి.