ఆలివ్ ఆయిల్‌ను గుడ్డు సొనలో కలిపి..?
శీతాకాలంలో చర్మానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి, కేశాలకు ఈ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఎండినట్లు అనిపిస్తే.. గుడ్డు సొనలో కొద్దిగా ఆలివ్ నూనె కలిసి తలకు రాసుకుని.. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు పట్టులా మారుతాయి. రోజూ వాడే షాంపూ లేదా కండీషనర్‌లో ఆలివ్ నూనెను కలిపి వాడినా ఫలితం ఉంటుంది.
వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి. చుండ్రు తగ్గుముఖం పడుతుంది. నిమ్మరసం, ఆలివ్‌నూనె కలిపి జుట్టుకు పట్టించి కాసేపయ్యాక తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తే చుండ్రు పోవడమే కాదు... వెంట్రుకలు నిగారింపును సంతరించుకుంటాయి.
ఇక చర్మానికి ఆలివ్ ఆయిల్ చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఆలివ్ నూనెలో కాసింత పంచదార కలిపి చర్మానికి మసాజ్ చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. స్నానానికి అరగంట ముందు ఆలివ్ ఆయిల్ రాసుకుని.. తలస్నానం చేస్తే చర్మం పొడిబారదు. మృదువుగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.