తలస్నానానికి అరగంట ముందు అది రాస్తే చుండ్రు మటాష్...
ఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరిని వేధించే సమస్య తలలో చుండ్రు. వయస్సుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికి తలలో చుండ్రు రావడం... సాధారణంగా చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది.
తలకు రాసుకునే షాంపులో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ. కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది. శరీరానికి కావలసినంత పౌష్టికాహారం తీసుకోకపోయిన శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయిన కూడా చుండ్రు వస్తుంది. చుండ్రుని తగ్గించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.
1. తలస్నానం చేయడానికి అరగంట ముందు పుల్లగా ఉండే పెరుగు, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. వారానికి ఒకసారి ఈవిధంగా చేయడం వల్ల తలలో పొట్టురాదు.
2. చుండ్రు ఎక్కువుగా ఉన్నప్పుడు మెంతులు నానబెట్టి పేస్టు చేసి దాన్ని తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
3. రెండు కోడిగుడ్ల సొనలో రెండు చెంచాల నీళ్లు బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని తలకు మర్దన చేయాలి. 10, 15 నిమిషాల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు పోవడమే కాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
4. మంచి నీటిలో ఉండే మినరల్స్ కూడా చుండ్రు తగ్గిస్తాయి. అందుకు రోజు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసులు నీరు తాగాలి.