త్రిఫలా చూర్ణములో తేనెను కలిపి రాత్రులందును...?
నేటి తరుణంలో చాలామంది మూర్చవ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందాలని ఏవేవో మందులు, మాత్రుల వాడుతుంటారు. అయినను వ్యాధి కాస్త కూడా తగ్గినట్టు అనిపించదు. అందువలన ఏం చేయాలంటే.. ఆయుర్వేదం ప్రకారం ఈ కింద తెలుపబడిన చిట్కాలు పాటిస్తే తక్షణమే వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
1. రేగు గింజలలోని పప్పు, మిరియాలు, వట్టివేరు, నాగకేసరములు, వీటి చూర్ణమును చల్లని నీటిలో కలిపి త్రాగించినా, పిప్పలి చూర్ణమును తేనెతో కలిపి త్రాగిస్తున్నా మూర్చవ్యాధి నయమవుతుంది.
2. శొంఠి, తిప్పతీగ, ద్రాక్ష, పుష్కరమూలము, మోడి వీటి కషాయములో పిప్పలి చూర్ణమును కలిపి త్రాగుతున్న మూర్చవ్యాధి నివారిస్తుంది.
3. పేలపిండిలో సమానంగా చక్కెర కలిపి, దానిని టెంకాయ నీళ్ళల్లో కలిపి త్రాగుతున్న.. పైత్యము, కఫము, మూర్భ, భ్రమ మొదలగునవి నివారిస్తాయి.
4. పిల్లిగడ్డలు, బలామూలము, ద్రాక్ష వీటిని చేర్చి, కాచబడిన పాలలో చక్కెరను కలిపి త్రాగుతున్నా.. బలాబీజములు చేర్చి కాచబడిన పాలలో చక్కెరను కలిి త్రాగుతున్నా భ్రమ, మూర్చరోగములు నివారిస్తాయి.
5. త్రిఫలా చూర్ణములో తేనెను కలిపి రాత్రులందును, అల్లపు ముక్కలను, బెల్లం కలిపి ఉదయం తీసుకోవాలి. ఇలా ఏడురోజులు తీసుకున్న.. మదము, మూర్చ, ఉన్మాదము నశిస్తాయి.
6. ఆవిరిమీద ఉడికించిన ఉసిరిక పండ్లగుజ్జు, ద్రాక్ష, శొంఠి చూర్ణము.. వీటన్నింటిని కలిపి మర్ధించే తేనెతో తీసుకుంటున్న.. మూర్చ, శ్వాసవ్యాధులు నశిస్తాయి.