సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (19:50 IST)

తెల్ల తెగడలను పొడిచేసి తేనెతో కలిపి తీసుకుంటే...?

కొందరైతే ఎప్పుడు చూసిన విరేచనాలతో బాధపడుతుంటారు. ఈ సమస్య కారణంగా ఏ పని చేయాలన్న అలసటగా, ఒత్తిడిగా ఉంటుంది. దాంతో నిద్రలేమికి కూడా గురికావలసి వస్తుంది. ఇలాంటి వాటిని చెక్ పెట్టాలంటే.. ఈ పద్ధతులు పాటిస్తే చాలు...
 
1. ఆముదమును రెండురెట్ల త్రిఫలా కషాయముతో గానీ, పాలతో గానీ కలిపి త్రాగిన వెంటనే విరేచనములగును. తెల్ల తెగడ, కొడిశపాల గింజలు, పిప్పళ్ళు, శొంఠి.. వీటిని పొడి చేసి ద్రాక్ష పండ్ల రసం, తేనెతో కలిపి తీసుకుంటే విరేచనములగును.
 
2. తెగడవేరు, చిత్రమూలము, విషబొద్ది, జీలకర్ర, దేవదారు.. వీటిని సమభాగములుగా తీసుకుని పొడిచేసి వేడి నీటిలో కలిపి త్రాగిన విరేచనకారి అగును. పిప్పళ్లు, శొంఠి, సైంధవ లవణము, నల్ల తెగడ, తెల్ల తెగలను పొడిచేసి తేనెతో కలిపి తీసుకుంటే సుఖముగ విరేచనములగును.
 
3. తెల్లతెగడ చూర్ణము, పంచదార సమభాగాలుగా తీసుకుంటే విరేచనమవుతుంది. వాత వ్యాధి గలవారు ఆముదమును, పైత్యవ్యాధి కలవారు పాలు, ద్రాక్ష కషాయమును, కఫవ్యాధులు కలవారు బెల్లముతో కూడిన త్రిఫల కషాయమును విరేచన ఔషధములుగా తీసుకోవాలి.
 
4. పిప్పళ్ళు ఒక భాగము, మోడి రెండు రెండు భాగములు, కరక్కాయ నాలుగా భాగములు పొడిచేసి వేడినీటిలో తీసుకున్న సుఖ విరేచనమవుతుంది. కరక్కాయ రెండు భాగములు, తెగడ ఎనిమిది భాగములు, శొంఠి రెండు భాగములు, సైంధలవణములు రెండు భాగాలు తీసుకుని కషాయం కాచి వడగట్టి సేవించిన విరేచనములవుతాయి.
 
5. కరక్కాయ వలుపు, సైంధవలవణము పిప్పళ్ళను పొడిచేసి వేడినీటిలో తీసుకున్న సుఖవిరేచములగును. విరేచన ఔషధము తీసుకున్నవారు గాలిలో తిరగకూడదు. మల, మూత్రములను నిరోధించకూడదు. నిద్రపోకూడదు, చన్నీటిలో తడవకూడదు. అజీర్ణకరమైన పదార్థములను తినకూడదు. వ్యాయామము చేయకూడదు.