బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 12 జులై 2018 (17:25 IST)

ఆలివ్ నూనెను తీసుకుంటే? జ్ఞాపకశక్తికి?

వయస్సు పెరిగే కొద్ది శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే. ఆ పరిణామాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన కొన్నింటి ఆధారంగా ఆ నియంత్రణను సాధించవచ్చును

వయస్సు పెరిగే కొద్ది శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే. ఆ పరిణామాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన కొన్నింటి ఆధారంగా ఆ నియంత్రణను సాధించవచ్చును. మెదడు కణాల క్షీణతా వేగాన్ని తగ్గించే శక్తి ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంది. కొవ్వు, కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో సహాయపడుతుంది.
 
ఈ క్షీణతా వేగాన్ని తగ్గించడం ఆలివ్‌ నూనెతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా ఉండడానికి దాదాపు 60 శాతం ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ అవసరం. ఇవి ఆలివ్ నూనెలో సమృద్ధిగా ఉన్నాయి. గింజధాన్యాలు, అవకాడో, నువ్వులనూనెలోనూ ఈ ఫ్యాట్స్ ఉన్నాయి. కాకపోతే ఆలివ్ నూనెలోని ఫ్యాట్స్‌కు కణజాలాల్లోకి వెళ్లే శక్తి చాలా అధికంగా ఉంటుంది.
 
ఈ ఫ్యాట్స్‌కి మెదడు కణాల మెంబ్రేన్ దెబ్బ తినకుండా కాపాడేందుకు సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతినే పరిస్థితి నుండి ఈ ఫ్యాట్స్ బాగా రక్షిస్తాయి. మెదడులోని న్యూరాన్లను దెబ్బ తీయడం ద్వారా అల్జీమర్ వ్యాధి కారకమయ్యే హానికారక ప్రోటీన్స్ నుండి ఆలివ్ నూనెలోని ఆలియోకాంథల్ అనే మూలకం కాపాడుతుందని పరిశోధనలో తెలియజేశారు.