శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:07 IST)

పిస్తా పప్పుతో అంటువ్యాధులు మటాష్

మార్కెట్‌లో మనకు దొరికే డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా పప్పు కూడా ఒకటి. ఇతర డ్రైఫ్రూట్స్ లాగానే పిస్తా పప్పు వలన కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పోషకాలతో పాటు విటమిన్ బి6, ఫైబర్, పాస్పరస్, కాపర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలోని హెమోగ్లోబిన్ వృద్ధికి దోహదం చేస్తాయి. ఊపిరితిత్తులు, ఇతర శరీర భాగాలకు ఆక్సీజన్ సరఫరా చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. 
 
అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధులు రాకుండా చూసుకుంటుంది. శరీరాన్ని ధృడంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిస్తా పప్పులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఇది పనిచేస్తుంది. శరీరంలోని చెడు పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. లావుగా ఉన్నవారు ప్రతిరోజూ దీనిని తింటే బరువు తగ్గే అవకాశం ఉంది. 
 
చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అందువలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఇది నరాల వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. రోజూ పిస్తాని తిన్నట్లయితే, శరీరానికి విటమిన్ ఇ సమృద్ధిగా అందుతుంది. చర్మ సౌందర్యానికి ఇది తోడ్పడుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు కూడా దీనిని తినవచ్చు. 
 
దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి ఉండటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు దరిచేరకుండా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా పిస్తా కాపాడుతుంది. ఫ్రీరాడికల్స్ నుండి కూడా ఇది రక్షిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.