శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By మోహన్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (12:58 IST)

వేసవి తాపాన్ని తగ్గించే నల్ల ఉప్పు..! (video)

భారతీయులు పురాతన కాలం నుండే నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు దాని వాడకం తక్కువైంది. వాస్తవానికి నల్ల ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.


న‌ల్ల ఉప్పును ఆయుర్వేదంలో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసేందుకు ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. అందులో అనేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. నల్ల ఉప్పు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఓ సారి చూడండి..
 
* సాధారణంగా వేసవి కాలంలో చాలా మంది శీతల పానీయాలు తాగుతుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పండ్ల ర‌సం లేదా కొబ్బ‌రి నీళ్ల‌లో చిటికెడు న‌ల్ల ఉప్పు క‌లిపి తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. వేసవి తాపం నుండి బయటపడవచ్చు. నల్ల ఉప్పుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది.
 
* గ్యాస్ సమస్యలతో సతమతమవుతున్న వారు చిటికెడు నల్ల ఉప్పు తింటే ఉపశమనం లభిస్తుంది.
* వేసవికాలంలో రోజూ నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి చేయకుండా ఉంటుంది.
 
* మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారు రోజూ నల్ల ఉప్పును తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు.
* కడుపులో మంట, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు, గుండెల్లో మంట ఉన్నవారు నల్ల ఉప్పు తింటే మంచి ఫలితం ఉంటుంది.