శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 23 నవంబరు 2017 (22:20 IST)

అన్నం తినే ప్రతి ఒక్కరు చదవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం....

తెల్లబియ్యం. మన దేశంలో అత్యధిక మంది రోజువారీ ఆహారం. కొన్ని ప్రదేశాల్లో అన్నంను ఒకటే పూట తింటారు. మరొకొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా తింటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ స్పృహ పెరిగింది. దీంతో అత

తెల్లబియ్యం. మన దేశంలో అత్యధిక మంది రోజువారీ ఆహారం. కొన్ని ప్రదేశాల్లో అన్నంను ఒకటే పూట తింటారు. మరొకొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు తింటారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కువగా తింటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యశ్రీ స్పృహ పెరిగింది. దీంతో అత్యధికంగా తీసుకునే తెల్లబియ్యంపై కూడా అవగాహన పెంచుకుంటున్నారు. ముఖ్యంగా తెల్లబియ్యం అంటేనే బాగా పాలిష్ చేస్తారని, దాంట్లో న్యూట్రీషియన్స్ తగ్గుతాయని, దాన్ని తినడం వల్ల ఎంతో నష్టమని, తెల్లబియ్యం తినడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 
తెల్లబియ్యంలో ఫైబర్ శాతం పెద్దగా ఉండదు. ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి తెల్లబియ్యంను మానేసి ఫైబర్ ఉన్న వాటిని తింటే మంచిది. కార్బోహైడ్రేట్స్ బియ్యంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్నం తినడం మానేస్తే బరువు తగ్గిపోతారు. అన్నం మానేస్తే అవసరానికి మించిన ఆకలి వేయదు. లిమిట్‌గా తింటారు. బియ్యం తినడం వల్ల ఇంట్లో స్టార్ట్ కంటెంటె తగ్గుతుంది. దీనివల్లే ఒంట్లో షుగర్ లెవల్ పెరిగుతూ ఉంటాయి. బియ్యం మానేయడం వల్ల ఒంట్లో బ్లడ్, షుగర్స్ నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తాయి. 
 
ఏ క్రీడాకారుడ్ని అడిగినా, సినిమా హీరోలు, బాడీబిల్డర్లు ఎవరిని అడిగినా వారు ఇదే చెబుతారు. అన్నం చాలా తక్కువ తింటామని చెబుతుంటారు. న్యూట్రియన్స్ ఉండే ఆహారం తీసుకుంటే శరీర భాగాలు బాగా పనిచేస్తాయి. మలబద్ధకం, అజీర్ణం, పొట్ట, లివర్ సమస్యలు, తక్కువ జ్ఞాపకశక్తి ఇవన్నీ దరిదాపులలోకి రాకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.