సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (11:56 IST)

భోజనంలో రోటీ తీసుకోవడం మంచిదంటారా?

రాత్రిపూట అన్నం తీసుకోకుండా రోటీలను మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. బియ్యంతో పోల్చితే గోధుమ పిండిలో ఐదురెట్లు ఎక్కువగా ప్రోటీన్లు వున్నాయి. మూడురెట్లు కార్బోహైడ్రేడ్లు, పదిరెట్లు పొటాషియం వున్నాయి. రైస్ కంటే గోధుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్‌లు తక్కువ. ఇంకా రోటీలను రాత్రి పూట తీసుకుంటే.. రక్తంతో చక్కెర స్థాయిలు పెరగవు. 
 
రక్తంలో గ్లోకోజ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే.. రాత్రిపూట నాలుగు రోటీలను తింటే సరిపోతుంది. రోటీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆకలి వేయదు. తద్వారా తీసుకునే ఆహారం పరిణామం కూడా తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. 
 
బియ్యంలో వుండే కార్బోహైడ్రేడ్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. గోధుమలో వుండే ఫైబర్ నిదానంగా జీర్ణమవుతుంది. రోటీలను తీసుకుంటే.. కార్బోహైడ్రేట్లు రక్తంలో కలవవు. అందుకే భోజనంలో రోటీని భాగం చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.