శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మే 2021 (12:43 IST)

రోగ నిరోధక శక్తిని పెంచే సీమ చింతకాయ..

Seema chintakaya
సీమ చింతకాయ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సీమ చింతకాయలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. వేసవిలో దొరుకుతుంది కాబట్టి తప్పక తీసుకోవడం మంచిది. సీమ చింతకాయ లో విటమిన్ సి, ఐరన్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. 
 
కరోనా సమయంలో విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలానే దీని వల్ల వచ్చే ప్రోటీన్స్ ఆరోగ్యానికి మంచివి. సీమ చింతకాయ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
 
దంతాలు కూడా శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా ఉంటుంది ఇది ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. సీమ చింతకాయ కంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. దీనిలో ఉండే మంచి గుణాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.