ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:23 IST)

నూడుల్స్ తీసుకుంటున్నారా... ఈ విషయాలు మీ కోసం...

నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. ఈ నూడుల్స్‌ను ఏకంగా ఇండ్లలోనే తయారు చేసుకుని మరీ తింటున్నారు. అయితే ఎలా తిన్నా, ఏ నూడుల్స్ తిన్నా అవి ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు వైద్యులు. మరి ఈ నూడుల్స్ వలన ఎలా

నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టమే. ఈ నూడుల్స్‌ను ఏకంగా ఇండ్లలోనే తయారు చేసుకుని మరీ తింటున్నారు. అయితే ఎలా తిన్నా, ఏ నూడుల్స్ తిన్నా అవి ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు వైద్యులు. మరి ఈ నూడుల్స్ వలన ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం.
  
 
అధిక బరువు గల వారు నూడుల్స్‌ను తినరాదు. ఒకవేళ తింటే బరువు ఇంకా పెరుగుతారు. ఎందుకంటే ఈ నూడుల్స్‌లో ఫైబర్ ఉండదు. కనుక వీటిని తీసుకుంటే ఫైబర్ ఏమాత్రం అందకపోగా వీటి వలన శరీరంలో గ్లూకోజ్ నిల్వలు పెరుగుతాయి. అది కొవ్వుగామారి అధిక బరువుకు కారణమవుతుంది.

నూడుల్స్ రెగ్యులర్‌గా తీసుకునే వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుందని పరిశోధనలలో చెబుతున్నారు. నూడుల్స్‌ను మైదా‌తో తయారు చేస్తారు. అందువలన వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. కనుక ఇది జంక్ ఫుడ్డే అవుతుంది.

నూడుల్స్‌లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి అధిక మోతాదులో చేరితే దాని ఫలితంగా బీపీ, తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. నూడుల్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువలన శరీరంలో అధికంగా నీరు చేరేందుకు కారణమవుతుంది. తద్వారా పాదాలు, చేతులు ఉబ్బినట్లవుతాయి.