శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (17:53 IST)

అదే పనిగా కూర్చుంటే.. మధుమేహం ముప్పు..

ఎక్కువ గంటల సేపు అదే పనిగా కూర్చుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెప్తున్నారు. అదేపనిగా ఎక్కువ గంటలు కూర్చుంటే మధుమేహం బారిన పడే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పని చ

ఎక్కువ గంటల సేపు అదే పనిగా కూర్చుంటే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెప్తున్నారు. అదేపనిగా ఎక్కువ గంటలు కూర్చుంటే మధుమేహం బారిన పడే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వారిలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కండరాలు క్రమంగా క్షీణిస్తాయి. మెడ, భుజం, తొడ ఇలా ప్రతి భాగంలోని కండరాలు తమ పటుత్వాన్ని కోల్పోతాయి. కండరాల క్షీణతతో పాటు ఎముకల సాంద్రతా తగ్గిపోతుంది. 
 
ముఖ్యంగా ఎక్కువ గంటలు కూర్చునే వారిలో గుండెజబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పెరిగిపోతాయి. రక్తపోటు పెరిగిపోవచ్చు. అంతేగాకుండా.. రోజులో అధిక భాగం కూర్చుని వుండటం ద్వారా మానసిక సమస్యలు పెరుగుతాయి. ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. 
 
అందుకే గంటల సేపు కుర్చీలకు అతుక్కుపోయేవారు.. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కూర్చునే విధానం సరిగ్గా వుండాలి. నిటారుగా కూర్చోవాలి. పాదాలు నేలకు తాకాలి. గంటకోసారి లేచి కనీసం ఐదు నిమిషాలైనా అలా నడవాలి. అప్పుడే ఒబిసిటీ సమస్య వేధించదని.. అనారోగ్య సమస్యలుండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.