బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 10 మే 2016 (08:44 IST)

పగటి నిద్ర ఆరోగ్యానికి హానికరమా? కునుకు తీయడానికి ఏ సమయం బెస్ట్!

ప్రతి ఒక్కరూ ఏమాత్రం కాస్తంత వీలు చిక్కినా ఓ చిన్నపాటి కునుకు తీసేందుకు ఇష్టపడుతారు. ముఖ్యంగా.. పగటి పూట ఈ అలవాటు అధికంగా ఉంటుంది. ఓ చిన్నపాటి కునుకుతో పని చేయడం వల్ల ఏర్పడిన అలసట పూర్తిగా మటుమాయమై పోతుంది. అలాగే, మెదకుతో పాటు... ఇతర శరీర అవయవాలకు కూడా కాస్తంత చురుకుదనం తెచ్చిపెడుతుంది. 
 
నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం ఉత్తమం. సాధారణంగా ఈ సమయంలోనే మన మనసులో నిద్ర వస్తుందన్న భావన కలుగుతుంది. అదేసమయంలో ఓ కునుకు తీయాలనుకునేవారు చిట్టి చిట్కాలు పాటిస్తే ఎంతో శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. 
 
వీలు చిక్కింది కదా అని మధ్యాహ్నం సమయంలో ఎక్కువ సేపు నిద్రపోకూడదు. ఎక్కువ సేపు కునుకు తీయడం వల్ల శరీరం మగతగా అనిపిస్తుంది. పైగా, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అలాగే, రాత్రిపూట నిద్రను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల వీలైనంత తక్కువ సేపు నిద్రపోవడం అన్ని విధాలా అనుకూలం. 
 
సాయంత్రం వేళల్లో నిద్రకు దూరంగా ఉండటమే మంచిది. నిద్రలేమి, శ్వాససంబంధిత సమస్యలతో బాధపడేవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు.