స్పటిక బెల్లంతో నోటి దుర్వాసన మటాష్..
Sugar crystal
చల్లని వాతావరణం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో గొంతు ఇబ్బందిగా మారడం కూడా ఒకటి. పటిక బెల్లం ఇందుకు బాగా పని చేస్తుంది. కొద్దిగా పటిక బెల్లాన్ని మిరియాల పొడి, నెయ్యితో కలిపి రాత్రి పూట తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే అందులో ఉండే డైజెస్టివ్ ప్రాపర్టీస్ అరుగుదలకి తోడ్పడుతాయి.
భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకునే అలవాటు చేసుకోవాలి. భోజనం తరువాత కొద్దిగా పటిక బెల్లం తీసుకుంటే తక్షణ శక్తి లభించినట్లు ఉంటుంది, బాగా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. భోజనం తరువాత ఎవరికైనా కొద్దిగా బద్ధకంగా ఉంటుంది. పటిక బెల్లం ఆ బద్ధకాన్ని తరిమి కొడుతుంది. కొద్దిగా సోంపు గింజలతో కలిపి తీసుకుంటే మీకు మంచి ఎనర్జీ బూస్టర్‌లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
