సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 18 మార్చి 2022 (23:29 IST)

చెరకు రసాన్ని చక్కెర వేసుకుని ఆ సమయంలో తాగకూడదు

వేసవిలో చెరకు రసం శరీరానికి శక్తినిస్తుంది. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఇందులో వున్నాయి. ఇది ఎముకలను బలపరిచే, రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచే, జీర్ణక్రియను మెరుగుపరిచే, ఒత్తిడిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

 
చెరకు రసం శరీరం నుండి టాక్సిన్స్, ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడే అద్భుతమైన మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంది. చెరకు రసం తాగడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు రాకుండా ఉంటాయి. ఇది కిడ్నీల సరైన పనితీరుకు దోహదపడుతుంది.

 
చెరకు రసంలో చక్కెరను కలపవద్దు. ఎందుకంటే ఖాళీ కడుపుతో చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది ప్యాంక్రియాస్‌పై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.