మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 19 ఏప్రియల్ 2018 (13:05 IST)

మధుమేహాన్ని నియంత్రించాలంటే? పాలకూర, మెంతి చపాతీలు?

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు నేరేడు పండ్లకు వున్నాయి. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని రోజుకు అరస్పూజ్ మోతాదులో తీసుకున్నా మంచి ఫలితం వుంటుంది. ఎందుకంటే నేరేడు గింజల్లో గ్

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు నేరేడు పండ్లకు వున్నాయి. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని రోజుకు అరస్పూజ్ మోతాదులో తీసుకున్నా మంచి ఫలితం వుంటుంది. ఎందుకంటే నేరేడు గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారకుండా అడ్డుకుంటుంది. అలాగే యాపిల్స్ కూడా మధుమేహాన్ని నియంత్రిస్తాయి. 
 
బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల  టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.
 
ముఖ్యంగా అల్పాహారంలో ఓట్స్, గోధుమలు వుండే విధంగా చూసుకోవాలి. ఓట్స్‌ లేదా గోధుమలను రవ్వగా కొట్టి పెట్టుకుని.. ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ, కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా వంటివి అల్పాహారంలో చేర్చుకోవచ్చు. అలాగే బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కూడా అల్పాహారంలో చేర్చుకోవచ్చు. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ మధుమేహులకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.