శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జులై 2018 (12:46 IST)

టెంపుల్‌ మసాజ్‌... ఎక్కడ చేస్తారు?

మసాజ్‌లు అంటే చాలు చాలామంది ముఖం అదొలా పెడుతుంటారు. కానీ అవి ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసి

మసాజ్‌లు అంటే చాలు చాలామంది ముఖం అదొలా పెడుతుంటారు. కానీ అవి ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ చేయించుకోవడం వల్ల  రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. అందుకే ఈ మసాజ్‌లను క్రమం తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
కాగా, పలు రకాల మసాజ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి టెంపుల్ మసాజ్. ఈ తరహా మసాజ్ థాయ్‌లాండ్‌లోని దేవాలయాల్లో చేస్తారు. ఈ మసాజ్‌ శరీరంపై తేలికపాటి ఒత్తిడిని కలుగజేస్తుంది. స్ట్రెచింగ్‌కు సహాయపడుతుంది. ఈ మసాజ్‌ వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని చిటికెలో మటుమాయం చేస్తుంది. 
 
బాగా నిద్రపడుతుందనీ, శరీరంపై, మెదడుపై నియంత్రణ సంపాదించవచ్చు. అంతేకాదు బ్లాక్‌ అయిన ఎనర్జీ విడుదలవుతుంది. శరీరం లోపల ఉండే ఎనర్జీని కూడా ఈ మసాజ్‌ సమతుల్యం చేస్తుంది. కండరాల ఒత్తిడిని పోగొట్టి అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండేట్టు సహాయపడుతుందని మసాజ్ స్పెషలిస్టులు చెబుతున్నారు.